హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ రివైజ్డ్ పేస్కేల్‌ను అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో యూజీసీ వేతన స్కేల్ పొందుతున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 65 ఏండ్లకు పెంచింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా జీవోతో ప్రొఫెసర్లు ఇకపై 65 ఏండ్లకు పదవీ విరమణ పొందనున్నారు.