హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : వర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచుతామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆదివారం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ మేరకు ప్రకటించారు. రాష్ట్రంలో 11 వర్సిటీల్లో 2,817 టీచర్ పోస్టులకు ప్రస్తుతం 757 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2,060 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నది. 6-7 వర్సిటీల్లో ఒక్కరంటే ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. రిక్రూట్మెంట్ విధానంపై ప్రభుత్వం ఇంత వరకు ఏదీ తేల్చలేదు. నెల నెలా కొందరు ప్రొఫెసర్లు రిటైర్మెంట్ అవుతున్నారు.