స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 7 : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ బోసు ఐలయ్య అప్పులబాధతో సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు సుమారు రూ.10 లక్షలకు పైగా అప్పులున్నాయని, అప్పు ఇచ్చినవారు ఇబ్బందిపెట్టడంతో సోమవారం సాయంత్రం పురుగు మందు తాగినట్టు తెలిపాడు.
ఆర్టీసీ డ్రైవర్‌గా 2013లో రిటైర్ అయ్యానని, 2016 నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో లీజుపై పార్కింగ్ అడ్డా పెట్టుకున్నట్టు తెలిపాడు. పార్కింగ్ అడ్డా లీజును రద్దు చేసుకోగా డిపాజిట్ డబ్బులు రూ.1.20లక్షలు రావాల్సి ఉందని చెప్పారు. వరంగల్-1డిపో ఆర్ఎం, డీఎంను ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదని, ఆ డబ్బులు వచ్చి ఉంటే అప్పు తీరేదని, ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తంచేశాడు.