Rani Kumudini | రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆమెను ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. రాణి కుముదిని 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె కేంద్ర, రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఈ ఏడాది జులై ఆమె పదవి విరమణ చేశారు. ఆమెను ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె మసబ్ ట్యాంక్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మూడేళ్ల పాటు కమిషనర్‌గా కొనసాగనున్నారు.