హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ): బీసీల హక్కులు, అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు టీ చిరంజీవులును పూలే ఎక్సలెన్స్ అవార్డు 2026కు ఎంపిక చేశారు. ఈ మేరకు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ రాజ్నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
రవీంద్రభారతిలో 10న నిర్వహించబోయే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఈ అవార్డు ప్రదానం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సీహెచ్ మధుసూదనాచారి, ఎంపీ ఈటల రాజేందర్, తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.