Minister Satyavati Rathod | చెరువుల పునరుద్ధరణతో కులవృత్తులకు జీవం : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati Rathod | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavati Rathod) అన్నారు.
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavati Rathod) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్(Fish Food Festival)ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం వల్ల అటు వ్యవసాయంతో రైతులు, చెరువులపై ఆదారపడ్డ కులవృత్తులకు పునర్జీవం కల్పించారని కొనియాడారు.
సీఎం కేసీఆర్(CM KCR)కు ఉన్న విజన్తోనే దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్వన్ గా నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram)ద్వారా 19 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందని అన్నారు. ఏడాదికి రెండు పంటలు పండేలా చేశారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే చెరువులు పూర్తిగా ఎండిపోయాయి.
నాడు చేపల దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. చెరువులో కోట్లాది ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా గంగపుత్రులు జీవనోపాధి పెరిగిందని పేర్కొన్నారు. అంతరించి పోతున్న కులవృత్తులను కాపాడుకోవడానికి,
గ్రామీణ ప్రాంతాలు కళకళలాడేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, మత్స్యశాఖ జిల్లా అధికారి నాగమణి, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

