నిర్మల్ అర్బన్, ఆగస్టు 9: నిర్మల్ పట్టణానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చక 27వ వార్డుకు చెందిన అయేషా కౌసర్, 39వ వార్డుకు చెందిన తౌహీద్ ఉద్దీన్ దంపతులు తమ రాజీనామా ప్రకటించారు.
రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డికి అందజేశారు. తమ వార్డుల అభివృద్ధే ధ్యేయంగా ప్రజల అభీష్టం మేరకు అధికార టీఆర్ఎస్లో చేరనున్నట్టు వారు స్పష్టం చేశారు.