హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఈ కాలేజీ ప్రారంభంకానుంది.
రాష్ట్రంలో ఇదే తొలి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ. బాలురతోపాటు బాలికలకు అడ్మిషన్లు కల్పిస్తారు.