కవాడిగూడ, మే 14: దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పను ల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ (సీఐడీఐ) జాతీయ కౌన్సిల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రు ణపడి ఉంటారని చెప్పారు. శనివారం దోమలగూడలోని సీఐడీఐ జాతీయ కార్యాలయంలో ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రస్తుతం ఉన్న ద్రవ్య పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచాలని కోరారు. సమావేశంలో ముఖ్య సలహాదారు న ర్రా రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నీరుడి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంపా తిరుపతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అద్దుల లక్ష్మణ్, యాచారం కృష్ణ, వాసు, శ్రీనివాస్ పుట్ట పాల్గొన్నారు.