హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ) : ఆవలింత, ధ్యానం, వ్యాయామం వంటివి మెదడును కూల్ చేస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. మెదడు జీవక్రియలు, రసాయనిక చర్యలపై సీసీఎంబీ శాస్త్రవేత్త అరవింద్ కుమార్, బయో ఇన్ఫర్మేటిషీయన్ ఆదిత్ర ఉండ్రు అధ్యయనం చేశారు. మెదడుపై ఒత్తిడి కలిగినప్పుడు, అంతర్భాగంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లుగా గుర్తించారు. ఆ ఉష్ణోగ్రతను తగ్గించే క్రమంలో మెదడు స్వయంగా ఆవలింతలు, ఇతర ప్రతిస్పందన ఆదేశాలను జారీ చేస్తుందని తేలింది.