చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్.. మరో అరగంటలో రాజును బయటకు తీసుకొస్తాం: కామారెడ్డి జిల్లా ఎస్పీ
Kamareddy | వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు.
కామారెడ్డి: వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరిందన్నారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు. అడ్డంగా ఉన్న బండరాళ్లను దాదాపు తొలగించామన్నారు. కాగా, రాజు బాగానే ఉన్నాడని, మంచిగా మాట్లాడుతున్నాడని, ధైర్యం కోల్పోలేదని అతని స్నేహితుడు అశోక్ తెలిపారు. తనంతట తానుగా బయటకు వచ్చేందుకు యత్నించాడని చెప్పారు. చాలా వరకు బయటకు వచ్చిన చివర్లో బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడని అన్నారు. రాజు భుజానికి గాయాలయ్యాయని వెల్లడించారు.

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో రాజు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం వేటకు వెళ్లాడు. అక్కడున్న ఓ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని ఫోను కింద పడిపోయింది. దానిని తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అతడిని బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో అతడు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

