హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రయానికి డి ప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మల్క కొమురయ్య, దయానంద్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శ్రీపాల్‌రెడ్డి, అంజిరెడ్డి, వాణీదేవి, మండలి సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.
శాసనసభ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జా తీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసన సభ్యుడు, శాసనమండలి సభ్యు డు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహ చార్యు లు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.