సర్కార్‌కు వారమే గడువు
‘ఏండ్లు గడుస్తున్నా మా సమస్యలు తీర్చడం లేదు. గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో మా సమస్యలపై చర్చించి, వారంలోగా పరిష్కారానికి చొరవ చూపాలి.
- లేదంటే ఆందోళన తప్పదు
- నేటి క్యాబినెట్లో చర్చించి మా సమస్యలు తీర్చండి
- కొందరు చేసిన తప్పుల్ని మిల్లర్లందరికీ ఆపాదించొద్దు
- అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి
- రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి
హైదరాబాద్, జులై 1(నమస్తే తెలంగాణ): ‘ఏండ్లు గడుస్తున్నా మా సమస్యలు తీర్చడం లేదు. గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో మా సమస్యలపై చర్చించి, వారంలోగా పరిష్కారానికి చొరవ చూపాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులను మూసివేసి ఆందోళనలకు దిగుతాం’ రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్పష్టంచేసింది. బుధవారం హైదరాబాద్‌లో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం దక్కడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అకౌంట్ సెటిల్మెంట్ చేసి మిల్లర్లకు వచ్చేవి ఉంటే ఇవ్వాలని, సివిల్ సైప్లెకి రావాల్సినవి ఉంటే వసూలు చేసుకోవాలని కోరారు. తమకు ఇచ్చే బకాయిలు ఇవ్వకుండా సివిల్సైప్లెకి వచ్చే నిధులను ముక్కుపిండి వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.4 వేల కోట్ల నుంచి 5వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వివరించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటికే సుమారు 1,000 మందికిపైగా మిల్లర్లు నష్టపోయి దివాలా తీశారని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లులు నడువక, బకాయిలు అందక, అధికారుల ఇబ్బందులు తాళలేక మిల్లర్లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని తెలిపారు.మిల్లర్లంతా చెడ్డవాళ్లు కాదని, కొందరి అక్రమాలను అందరికీ ఆపాదించి ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గణపతిరెడ్డి కోరారు. మిల్లింగ్ వ్యవస్థలో జరిగే అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాచకొండ కిష్టయ్య, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, శశికాంత్ పాల్గొన్నారు.
రా రైస్ మిల్లర్ల డిమాండ్లు ఇవే..
- పాత బకాయిలు విడుదల చేయాలి
- 25 శాతం పెనాల్టీని రద్దుచేయాలి
- 200 హెచ్‌పీ విద్యుత్తును ఎల్టీ క్యాటగిరీ కింద ఇప్పించాలి
- డిఫాల్ట్ మిల్లర్లు బాకీ ఉన్న బియ్యాన్ని నాలుగు విడతల్లో ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలి
- 2022-23 రబీ టెండర్ ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి రూ.2,160 మాత్రమే వసూలు చేయాలి
- ప్రస్తుత వానకాలం సన్నధాన్యం టెండర్ రద్దుచేసి రబీ దొడ్డు రకం ధాన్యాన్ని టెండర్ వేయాలి.
- 67శాతం సీఎమ్మార్ రావడంలేదని, మరోసారి టెస్ట్ మిల్లింగ్ చేయించి దాని ప్రకారం సీఎమ్మార్ తీసుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

