హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన కే రామకృష్ణారావుకు గ్రూప్-1 అధికారుల సంఘం ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ నేతలు శుక్రవారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంతునాయక్, ఇతర అధికారులు సయ్యద్ యాసిన్ ఖురేషీ, శ్రీధర్, హరికిషన్ తదితరులు ఉన్నారు.