హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతి మరణించిన ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో ర్యాగింగ్ నివారణ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ర్యాగింగ్ కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేస్తున్నదీ లేనిదీ వివరించాలని పేర్కొన్నది.
ప్రీతి మృతికి కారణమైన నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సీజే అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతిని సైఫ్ ర్యాగింగ్ చేయటంతో మణించిందని ఆరోపిస్తూ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్ల య్య లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.