అచ్చంపేట, జూన్ 24: శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టు దేశంలోనే అత్యంత గొప్పదని, ఇలాంటి ప్రాజెక్టును కాపాడుకోవడం ప్రజా ప్రభుత్వం బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సో మవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు సొరంగంలోని హైడల్ ప్రాజెక్టును ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేఘారెడ్డి, రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పర్ణికారెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు.
నాలు గో యూనిట్ గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. జెన్కో అధికారులు ప్రాజెక్టు పూర్తి వివరాలతో కూడిన పవర్ ప్రజెంటేషన్ ను ఇచ్చారు. అనంతరం విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో నాలుగో యూనిట్ పునరుద్ధరణ రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రూ.60 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి చేయడానికి రూ.2 కోట్ల ఖర్చు కోసం ఆలస్యం చే యొద్దని సూచించారు.
రానున్న మూడు నెలలపాటు వచ్చే వరదతో 60 కోట్ల విద్యుదుత్పత్తిని తయారు చేస్తామని, అందుకోసం వెంట నే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలుగో యూనిట్ పునరుద్ధరణకు నిధుల కొరత లేదని తెలిపారు. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి యూనిట్‌ను రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు పవర్‌హౌస్‌లో 2020 సెప్టెంబర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మల్లన్న సన్నిధిలో అపచారం
శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. కానీ భట్టి కుమారుడు ప్యాంట్‌పైనే పంచె కట్టుకొని దర్శనానికి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లన్న సన్నిధిలో అపచారం అంటూ సోషల్ మీడి యాలో భక్తులు ఆవేదనం వ్యక్తం చేశారు.