KRMB | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ కుడి, ఎడమగట్టు, ప్రధాన విద్యుత్తు కేంద్రాలకు సంబంధించి మరమ్మతులు, నిర్వహణ పనులను వారంలో ఒకరోజు మాత్రమే చేసుకోవాలని, మొత్తంగా 3 నెలల్లో సంబంధిత పనులను పూర్తిచేసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆంక్షలు విధించింది. అందుకు అనుగుణంగా డ్యాంపై టీఎస్, ఏపీ జెన్కో అధికారుల రాకపోకలను కొనసాగించేందుకు షరతులుతో అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు తాజాగా లేఖలు రాసింది. నాగార్జునసాగర్ డ్యాం కుడిగట్టు విద్యుత్తు కేంద్రం ఏపీ ఆధీనంలో.. ఎడమగట్టు, ప్రధాన విద్యుత్ కేంద్రం తెలంగాణ ఆధీనంలో ఉన్నాయి. ఆయా పవర్హౌజ్లకు సంబంధించి రోజువారీతోపాటు, వారం, నెల, సీజన్ వారీగా మెయింటనెన్స్ పనులతోపాటు, సీజన్‌వారీగా మరమ్మతులను గుర్తించి అందుకు సంబంధించిన పనులు సైతం నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇది ఎలాంటి ఆటంకం లేకుండానే కొనసాగింది. నవంబర్ 30న ఏపీ డ్యాం కుడివైపు భాగాన్ని అప్రజాస్వామికంగా ఆక్రమించుకోవడం, ఆపై కేంద్రం జోక్యం చేసుకొని ప్రాజెక్టును స్వాధీనం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది.
డ్యాం నుంచి నీటి విడుదలతోపాటు ఇరు రాష్ర్టాల అధికారుల రాకపోకలపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. కేంద్రజల్‌శక్తి విధించిన నిబంధనల మేరకు కేఆర్ఎంబీ బోర్డు అనుమతి పొందిన తరువాతే ఇరు రాష్ర్టాల అధికారులను సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాంపైకి అనుమతిస్తాయి. పవర్‌హౌస్‌ల నిర్వహణపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, పవర్హౌజ్లకు సంబంధించి నీటిని తీసుకెళ్లే గేట్లు (పెన్‌స్టాక్ గేట్లు), సాధారణ, ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ పనులకు సైతం ఆటంకం ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ, ఏపీ రాష్ర్టాల సాగునీటిపారుదలశాఖ, జెన్కో అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. పనుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో గత నెల 23న ఇరు రాష్ర్టాలకు సంబంధించిన ఇరిగేషన్, జెన్కో అధికారులతోపాటు, కేఆర్ఎంబీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. పవర్హౌజ్లను పరిశీలించడంతోపాటు అక్కడే సంయుక్త సమావేశం నిర్వహించింది.
వారానికి ఒకసారి పెన్‌స్టాక్ ఇన్‌టేక్ గేట్ల రెగ్యులర్, సాధారణ నిర్వహణ అవసరమని, అదేవిధంగా పరికరాల మార్పు, నిర్వహణ, మరమ్మతు, మెకానిజం రీప్లేస్మెంట్ తదితర ప్రత్యేక పనులను ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చని నిర్ణయించింది. పెన్‌స్టాక్ గేట్లకు సంబంధించిన అత్యవసర పనులేవైనా పిగ్ మెకానిజం, టర్బైన్, నిర్వహణ లోపాలను నివారించేందుకు వెంటనే మరమ్మతులు చేయాల్సి ఉంటుందని, అందుకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో పవర్హౌజ్లకు సంబంధించి ఆయా పనుల నిర్వహణకు కేఆర్ఎంబీ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. మరోవైపు, తెలంగాణ, ఏపీ జెన్కో అధికారులకు డ్యామ్‌పై రాకపోకలు సాగించేందుకు ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
కేఆర్ఎంబీ ఆదేశాలు ఇలా