High Court | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ మహంకాళి మందిరంలోని ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను, వాటి లింకులను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర సైబర్‌క్రైం విభాగాన్ని ఆదేశించింది. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం వీడియోల లింకులను తొలగించలేదంటూ న్యాయవాది ఐ రామారావు వేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని, వాటి వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని తెలిపారు. అనంతరం ఆ వీడియోలను తొలగించాలని కేంద్ర సైబర్‌క్రైం విభాగాన్ని ఆదేశించిన న్యాయమూర్తి.. పిటిషనర్ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మారేడ్‌పల్లి పోలీసులకు స్పష్టం చేశారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొనవారిపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని బుధవారం విచారణ జరుగనున్నది.
కుల, మతాలు ఐచ్ఛికమే
రాజ్యాంగం ప్రకారం కులం, మతం అనేవి ఐచ్ఛికమని, వా టిని బహిర్గతం చేయాలన్న నిబంధన ఏమీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జనగణన సమయంలో కులం, మతం వివరాలను వెల్లడించాలా? లేదా అన్న స్వేచ్ఛను నేషనల్ సెన్సస్ కమిషన్ ప్రజలకే కల్పించిందని గుర్తు చేసింది.