మంచిర్యాల, నవంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దీక్షా దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మంచిర్యాల జనరల్ దవాఖానలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ పండ్లు పంపిణీ చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ జిల్లా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఏడాది పాలన సంబురాలు జరుపుకొంటున్న తరుణంలో బీఆర్ఎస్ జెండా లు ఏర్పాటు చేయడం సరికాదన్నారు.
దీక్షాదివస్‌కు అధికారుల ఆటంకాలు
ములుగురూరల్, నవంబర్ 29: ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి డివైడర్లకు బీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండాలు, తోరణాలు కట్టగా మున్సిపల్ సిబ్బంది తొలగించారు.గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోరిక గోవింద్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, మాజీ ఎంపీటీసీ పోరిక విజయ్‌రామ్‌నాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి బీఆర్ఎస్ తోరణాల తొలగింపును ఖండించారు.