నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు తెగబడుతున్నారు. తాజాగా నల్లగొండలో కేటీఆర్ రైతు మహాధర్నా(Rythu Mahadharna) ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. నేటి రైతు ధర్నాకు పోలీసులు అనుమతించలేదు. అయితే అప్పటికే నల్లగొడ పట్టణంలో ధర్నాకు సంభందించి ఫెక్సీని బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు.
కాగా, అర్ధరాత్రి వాటిని తొలగింస్తుండగా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించారు. అయినప్పటికి అధికారులు ఫ్లెక్సీని తొలగించారు. కాంగ్రెస్ చెత్త రాజకీయాన్ని ప్రశ్నించేందుకు మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేరుకున్నారు. అయినప్పటికి మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు. మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తుండటంతో కమిషనర్ ఛాంబర్ లోనే పార్టీ కౌన్సిలర్లు, నేతల్తో కలిసి భూపాల్ రెడ్డి బైఠాయించారు.
కాగా, మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలో హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్యాలయంలోకి కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి రంగ ప్రవేశం చేశారు. బీఆర్ఎస్ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పూల కుండీలు విసురుతూ దాడికి యత్నించారు.
కాంగ్రెస్ నేతల దౌర్జన్యంపై పోలీసులు చూస్తూ ఉండి పోయారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కంచర్లతో సహా బీఆర్ఎస్ నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసులతో తీవ్ర తోపులాటలో భూపాల్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేతలు మున్సిపాలిటీ కార్యాలయంలోనే ఉండటం గమనార్హం.