Khanamet | ఖానామెట్ కబ్జాల తొలగింపు.. ఫెన్సింగ్ నేలమట్టం చేసిన అధికారులు
Khanamet | ఖానామెట్‌లోని భూములను కబ్జాచేసి నిర్మించిన కట్టడాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు గురువారం చేపట్టారు. కబ్జాదారులు సర్వే నంబర్ 41/11లో వేసిన రేకుల ఫెన్సింగ్‌ను జేసీబీలతో నేలమట్టం చేశారు.
Khanamet | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): ఖానామెట్‌లోని భూములను కబ్జాచేసి నిర్మించిన కట్టడాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు గురువారం చేపట్టారు. కబ్జాదారులు సర్వే నంబర్ 41/11లో వేసిన రేకుల ఫెన్సింగ్‌ను జేసీబీలతో నేలమట్టం చేశారు. ఆ పక్కనే మరో భూమిలో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులూ అక్కడికి చేరుకుని భూ యజమానుల నుంచి వివరాలు సేకరించారు. బాధితులు ఫిర్యాదు చేసినా మాదాపూర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంటెలిజెన్స్ అధికారులు దానిపై ఆరా తీసినట్టు సమాచారం. అధికారుల ప్రవేశంతో కబ్జాలు నిజమేనని ధ్రువీకరణ అయ్యింది. సర్వే నంబర్ 41/11లోని 1400 గజాలతోపాటు పక్కనే ఉన్న మరికొంత భూమిలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేశారు.
కబ్జా ప్రాంతంలోనే బౌన్సర్ల తిష్ట
రెవెన్యూ అధికారులు కబ్జాలను తొలగించినా బౌన్సర్లు మాత్రం అక్కడి నుంచి కదల లేదు. కబ్జాదారులకు సంబంధించిన బౌన్సర్లు అక్కడే ఉండి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియా ప్రతినిధులను సైతం వారు అడ్డుకున్నారు. దీనిపై మాదాపూర్ పోలీసులను సంప్రదించగా రెవెన్యూ అధికారులను అడగాలని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

