హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులపాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలి వణికించగా.. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మూడ్రోజులపాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా ఎకువ నమోదయ్యే అవకాశాలున్నట్టు వెల్లడించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. సంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. శనివారం వరకు ఉష్ణోగ్రతలు స్ప ల్పంగా పెరుగుతాయని, ఉదయం పొగమంచుతోపాటు ఆ కాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు.