హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతర తాతాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, సేవలను పొడిగిస్తూ ఇచ్చే ‘కంటిన్యూయేషన్ ఆర్డర్స్’ రావడం ఆలస్యం కావడంతో ఎవరికీ వేతనాలు నిలిపివేయవద్దని ఆర్థికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూడకుండా జూన్ 30 వరకు తాతాలిక ఉద్యోగుల బిల్లులను ఆమోదించి, రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించాలని ట్రెజరీ, సంబంధిత హెచ్వోడీలను ఆదేశించింది.
ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం మెమో జారీచేశారు. తాతాలిక పద్ధతిలో వి ధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ ప్రతినెలా ఎలాంటి ఆలస్యం లేకుండా రెమ్యునరేషన్ చెల్లించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆ మెమోలో పేరొన్నారు. మార్చి 31నాటికి ప్రభుత్వ అనుమతితో తాతాలిక సేవలందిస్తూ, నూతన సంవత్సర పొడిగింపు ఉత్తర్వుల కోసం వేచిచూస్తున్న ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, డైరెక్టర్ ఆఫ్ వర్స్ అండ్ అకౌంట్స్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (హైదరాబాద్), రాష్ట్రంలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు, ఫైనాన్షియల్ ఆఫీసర్లు ఈ తాతాలిక సేవల బిల్లులను జూన్ 30 వరకు తక్షణమే అనుమతించాలని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జారీచేసిన మెమోలో పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనం, యాక్టివిటీ ఔట్సోర్సింగ్, ఎంటీఎస్, డెయిలీ వేజ్, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్, గెస్ట్, అవర్లీ బేస్డ్ (గంటల ప్రాతిపదికన) పనిచేస్తున్న ఉద్యోగులందరి సర్వీస్ పొడిగింపు ప్రతిపాదనలను తక్షణమే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ప్రక్రియను పూర్తిచేయాలని తెలిపారు.
ఈ తాతాలిక సేవలను పొడిగించే క్రమంలో సదరు విభాగాల్లో ఆయా సేవల అవశ్యకత, అవసరాలను క్షుణ్ణంగా పునఃపరిశీలించి, పూర్తి స్థాయి అంశాలను నివేదికలో పొందుపర్చాలని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అధికారిక సేవా పొడిగింపు ఉత్తర్వులను కచ్చితంగా 2026 జూన్ 30లోపు లేదా అంతకంటే ముందే జారీచేసేలా అన్ని అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది తాతాలిక ఉద్యోగులకు వేసవి కాలంలో జీతాలపరంగా పెద్ద ఊరట లభించినట్టయింది.