మన్నె క్రిశాంక్‌కు ఊరట
బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వోల విచారణకు సంబంధించిన వ్యవహారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై నమోదైన కేసులో క్రిశాంక్‌ను అరెస్టు చేయరాదని, బీఎన్ఎస్ఎస్లోని 35(3) కింద ఆయనకు నోటీసు జారీచేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.
- అరెస్టు చేయరాదన్న హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వోల విచారణకు సంబంధించిన వ్యవహారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై నమోదైన కేసులో క్రిశాంక్‌ను అరెస్టు చేయరాదని, బీఎన్ఎస్ఎస్లోని 35(3) కింద ఆయనకు నోటీసు జారీచేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.
తనపై నమోదైన కేసును చట్టప్రకారం దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ క్రిశాంక్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై జస్టిస్ టీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పోలీసులు ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారని ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే చెప్పడంతో.. పిటిషనర్ తరఫు నాయవాది జోక్యం చేసుకున్నారు. క్రిశాంక్ ఇంకా అరెస్ట్ కాలేదని, ఆయనను మేజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపలేదని తెలిపారు. దీంతో పిటిషనర్‌ను అరెస్ట్ చేయరాదని, చట్టప్రకారం నోటీసులు జారీచేసి విచారించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

