సంగారెడ్డి : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన వర్షానికి సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మూడంతస్తుల భవనం శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కాలేదు.గల్లంతైన వారు ఈ శిథిలాల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చాకే సహాయక చర్యల పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం. ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 51కి పెరిగింది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కార్మికులు, సిబ్బంది మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. ప్రమాదంలో 36 మంది మరణించినట్టు మంగళవారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 14 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉన్నది.