నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, యూట్యూబ్ వేదికగా తప్పుడు పోస్టులు పెట్టినట్టు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్ఎస్కు చెందిన యూట్యూబర్ సిద్దమోని నరేశ్‌గౌడ్‌ను పోలీసులు విడుదల చేశారు. సెక్షన్లు 67 ఐడీఏ-2000-2008, 353(2), 352, 193, 196 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పేరు, ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు అహ్మద్ అస్లామ్ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 41-ఏ నోటీసులు జారీ చేయాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మణ్గంగా పోలీసులను ప్రశ్నించడంతో రిమాండ్‌కు తరలించకుండా విడుదల చేశారు.