హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు గురువారం ప్రభుత్వం రూ.8.21 కోట్ల నిధులు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నది. ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు, ఇతర బిల్లుల చెల్లింపులకు వీటిని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది.