FIFA World Cup 2026 | అద్భుతమైన ఆటతీరుతో ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి అర్జెంటీనా దూసుకెళ్లింది. అట్లాంటా వేదిక జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకొని ఈనెల 20న స్పెయిన్‌తో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది. హోరా హోరిగా సాగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఆఫ్‌లో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీని ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్ధవంతంగా అడ్డుకున్నారు. మ్యాచ్ 55వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆంథోనీ గోర్డాన్ అద్భుత గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
అర్జెంటీనా ఓటమి అంచుల్లో నిలిచిన దశ నుంచి ఊహించని రీతిలో పుంజుకుంది. ఇందులో కెప్టెన్ మెస్సీ పాత్ర కీలకంగా మారింది. మ్యాచ్ ముగియడానికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉన్న దశలో అర్జెంటీనా ఆట స్వరూపాన్నే మార్చేసింది. 85వ నిమిషంలో మిడ్ ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ డి బాక్స్- లాంగ్ రేంజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది.
ఇక 92వ నిమిషంలో (ఇంజ్యురీ టైమ్) లియోనెల్ మెస్సీ అద్భుతమే చేశాడు. మెస్సీ అందించిన క్లాసిక్ క్రాస్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ లౌటారో మార్టినెజ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచి అర్జెంటీనాకు 2-1తో తిరుగులేని విజయాన్ని అందించాడు. దీంతో ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ సేన వరుసగా రెండోసారి క్వాలిపై అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లండ్ 19న ఫ్రాన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మూడో స్థానం కోసం పోటీ పడనున్నది.