Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో
Akhil | అక్కినేని అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ సందడి చేసే గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును ఎట్టకేలకు వ్యక్తిగతంగా కలుసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ భేటీలో చోటు చేసుకున్న భావోద్వేగ క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సందర్భంగా థియేటర్ల వద్ద నాగరాజు చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది.
Akhil | అక్కినేని అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ సందడి చేసే గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును ఎట్టకేలకు వ్యక్తిగతంగా కలుసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ భేటీలో చోటు చేసుకున్న భావోద్వేగ క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సందర్భంగా థియేటర్ల వద్ద నాగరాజు చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది. అఖిల్ కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అఖిల్ దృష్టికి కూడా చేరాయి. అప్పుడే అవకాశం దొరికితే నాగరాజును తప్పకుండా కలుస్తానని అఖిల్ హామీ ఇచ్చారు.
ఆ మాటను నిలబెట్టుకుంటూ బుధవారం నాగరాజును తన వద్దకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసిన ఆనందంలో నాగరాజు భావోద్వేగానికి గురయ్యాడు. అఖిల్ కాళ్లపై పడేందుకు ప్రయత్నించగా, వెంటనే అతన్ని ఆపిన హీరో ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణంలో నాగరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ, “ఈ జన్మకు ఇది చాలు” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అక్కడున్న వారిని కూడా ఈ దృశ్యాలు కదిలించాయి. ఈ భావోద్వేగ భేటీకి సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, క్షణాల్లోనే వైరల్ అయింది. అభిమానులు, సినీప్రియులు అఖిల్ వ్యవహరించిన తీరు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అభిమానులకు ఇంత విలువ ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.
గుంటూరుకు చెందిన నాగరాజు సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. రోడ్డుపై పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన, అఖిల్ సినిమా విడుదలైనప్పుడు మాత్రమే అభిమానిగా కనిపిస్తాడు. మిగతా సమయాల్లో తన ఉపాధిపైనే దృష్టి పెడుతుంటాడు. సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చినప్పటికీ, దానిని ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, కేవలం అభిమానిగా ఉండటానికే ప్రాధాన్యం ఇవ్వడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. ఇతర హీరోల అభిమానులతో వివాదాలు, ట్రోలింగ్‌లకు దూరంగా ఉండే నాగరాజు, తన అభిమానాన్ని హద్దులు దాటకుండా వ్యక్తపరుస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఇప్పుడు అఖిల్‌తో జరిగిన ఈ భేటీతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అభిమానిని ఇంత ఆప్యాయంగా కలుసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అఖిల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
The most famous “Ayyagare”…
Finally met his favourite “Ayyagaru.” ❤️A moment worth every celebration… and one that will be remembered for a long time 🫶🏻@AkhilAkkineni8 #Nagaraju#Lenin #BlockbusterLenin pic.twitter.com/HFejwxbew7
— Annapurna Studios (@AnnapurnaStdios) July 15, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Amala
- ayyagaru
- Chiranjeevi
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

