హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తన సస్పెన్షన్‌కు సంబంధించిన అధికారిక బులెటిన్‌ను విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. అధికార పార్టీ చెప్పడంతో శాసనసభ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేశారని, కానీ దానిపై ఇప్పటి వరకు అధికారిక బులెటిన్ విడుదల కాలేదని పేర్కొన్నారు. అందుకోసం తాను శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులును సంప్రదించినా స్పందన లేదని చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా నేను మీ (స్పీకర్) పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. ఏకవచన ప్రయోగం చేయలేదు. ప్రభుత్వం నాపై దురుద్దేశపూర్వకంగా, సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టింది’ తెలిపారు.