హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, మైనార్టీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యా హ్నం భోజన పెండింగ్ బిల్లులకు సం బంధించి సుమారు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో బుధవారం ఆ యన ఆర్థికశాఖ, గురుకులాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఎస్సీ గురుకులాలు, మైనార్టీ విద్యాసంస్థలకు ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.