Inter Exams | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధనను బోర్డు సడలించింది. పరీక్ష ప్రారంభానికి అంటే ఉదయం 9 గంటలకు… ఆ తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ అనుమతించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకొని, విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. నిమిషం నిబంధన కారణంగా అనేకమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పరీక్ష రాయని ఓ విద్యార్థి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.