హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట మండ లం సర్వే నంబర్ 27/ఏఏలోని 287 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు చేసిన దరఖాస్తును జీహెచ్ఎంసీ తిరసరించడాన్ని సవాలు చేయడంతోపాటు ఆ స్థలం సేల్ డీడ్ రిజిస్ట్రేషన్‌ను రుద్ద చేయాలని కోరుతూ కూకట్‌పల్లికి చెంది న కమలమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ, పిటిషనర్ల వాదన ల అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. ప్రజావసరాల కోసం వదిలిన స్థలాలపై డెవలపర్లకు హకులు ఉండబోవని, రోడ్డు కోసం నిర్ధేశించిన స్థలాన్ని క్రమబద్ధీకరించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. రోడ్డు స్థలంలోని ప్లాట్ ఎల్ఆర్ఎస్ కోసం పిటిషనర్ చేసుకున్న దరఖాస్తును కొట్టివేయ డం చట్టబద్ధమేనని వెల్లడించింది. కానీ, జీహెచ్ఎంసీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం చెల్లదని పేరొన్నది.