మరికల్, జూలై 7: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామ శివారులోని పంప్‌హౌస్ నుంచి కోయిల్‌సాగర్‌కు పంపింగ్ మొదలైంది. శుక్రవారం జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి మోటర్‌ను ప్రారంభించి కృష్ణమ్మకు పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సారథ్యంలో కోయిల్‌సాగర్‌కు నిత్యం 315 క్యూసెక్కులను పంపింగ్ చేయనున్నట్టు ఆమె తెలిపారు.