Sunlight | హైదరాబాద్: మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకోవాలనుకొంటే రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి. అతినీల లోహిత కిరణాలు తక్కువ ఉన్న సూర్యరశ్మితో ఆరోగ్యం మెరుగవుతుందని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ఎక్స్‌లో వెల్లడించారు.
ఒక అధ్యయనాన్ని పేర్కొంటూ, సూర్యరశ్మి తగిలే పొగ తాగే వారి జీవిత కాలం రెండేండ్లు పెరిగిందన్నారు. డయాబెటిస్, రక్త పోటు, గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం తగ్గుతుందన్నారు. విటమిన్ డి సప్లిమెంట్స్, సహజ సూర్యకాంతి ద్వారా వచ్చే ప్రయోజనాలు ఒకటి కావన్నారు.