Vehicle Registration | వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి షోరూమ్ వద్దే రిజిస్ర్టేషన్!
Vehicle Registration | ఇక నుంచి కార్లు, బైక్‌లు కొనుగోలు చేసినవారు వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చేపట్టిన ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్ విజయవంతమవడంతో నేటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
Vehicle Registration | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఇక నుంచి కార్లు, బైక్‌లు కొనుగోలు చేసినవారు వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చేపట్టిన ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్ విజయవంతమవడంతో నేటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సాఫ్ట్వేర్ తయారుచేసి ప్రయోగాత్మకంగా పరీక్షించామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ‘ఎలివేట్ జెడ్ఎక్స్ ఎంటీ 4’ వీలర్‌కు రిజిస్ట్రేషన్ చేసి వాహనదారుకు సర్టిఫికెట్ అందజేసినట్టు చెప్పారు.
సాఫ్ట్వేర్ విజయవంతం కావడంతో శనివారం నుంచి కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్ కోసం యజమానులు రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే షోరూమ్‌ల వద్దే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. ఈ విధానం ప్రకారం అధీకృత డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం- 21, ఫారం- 22, బీమా, చిరునామా రు జువు, వాహన ఫొటోలు అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నేరుగా స్పీడ్‌పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తా రు. ఈ సౌకర్యం బైక్‌లు, కార్లకే వర్తిస్తుందని, వాణిజ్య(ట్రాన్స్పోర్ట్) వాహనాలకు వర్తించదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

