హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇకపై స్లాట్ బుక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుం ది. ఈ మేరకు రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తొలిదశలో గురువారం నుంచి 22 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10న నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రోజూ 48 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. రద్దీ ఎక్కువ ఉండే చోట అదనంగా మరో సబ్ రిజిస్ట్రార్‌ను నియమించనున్నట్టు తెలిపారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మలాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సిబ్భందిని నియమించినట్లు తెలిపారు. ఒకవేళ స్లాట్ బుక్ చేసుకోనివారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయం త్రం 5 నుంచి 6 గంటల వరకు ఐదు వాక్ ఇన్రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారని తెలిపారు.