Registration Charges | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): నవంబర్ నుంచి సవరించిన చార్జీలను రిజిస్ట్రేషన్ చార్జీలను అమలు చే యాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థి రాస్తుల రిజిస్ట్రేషన్‌కు కొత్త ధరలను ఆగ స్టు 1 నుంచే అమలు చేయాలని భావించింది. ఈ మేరకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జూన్‌లో షెడ్యూల్‌ను విడుదల చే సింది. అధికారులు జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక ఇచ్చా రు. ఈ నివేదికపై ప్రభుత్వం సంతృప్తి చెం దలేదు. దీంతో ధరల సవరణ అధ్యయన బాధ్యతలను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీ గా భూముల విలువను అధ్యయనం చే సి, ఎక్కడ పెంచేందుకు అవకాశం ఉన్న దో, ఎక్కడ తగ్గించాల్సి వస్తుందో, ఎంత మేర సవరించాలో సూచించాలని పేర్కొన్నది.
ఈ మేరకు ప్రైవేట్ సంస్థ అధ్యయ నం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం పనులు ప్రారంభం కావడం, ఫ్యూ చర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాల నేపథ్యంలో వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల సవరణపైనా అధ్యయనం చేసినట్టు చెప్తున్నా రు. వారంరోజుల్లో ఈ నివేదిక ప్రభుత్వానికి చేరనున్నట్టు సమాచారం. ప్రభుత్వం సమీక్ష అనంతరం ఏ స్థాయిలో ధరలను సవరించాలో నిర్ణయిస్తారని చెప్తున్నారు. నవంబర్ మొదటివారంలో పెంపును అ మలు చేసే అవకాశం ఉంది. ‘ఇది రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు కాదు. శాస్త్రీయంగా ధరల స్థిరీకరణ. స్థానిక పరిస్థితులను బట్టి చార్జీలు పెంచాలో, తగ్గించాలో నిర్ణయం తీసుకొని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది’ అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
బది‘లీలల’పై కొరడా?
రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల బదిలీల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటారని సమాచారం. ఈ బదిలీల్లో అధికారపక్ష నేతలు, ఉన్నతాధికారుల సన్నిహితులకు కోరుకున్న స్థానాలను కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. రూ.కోట్ల మేర చే తులు మారినట్టు చర్చ జరిగింది. కొంద రు అధికారులే దళారుల అవతారం ఎత్తి పోస్టింగ్‌ల బదిలీలల్లో కీలక పాత్ర పోషించారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి, సీఎం గుర్రుగా ఉన్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.