కరకగూడెం, జూలై 9: బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నర్సమ్మ(90) భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలోని స్వగ్రామమైన కుర్నవల్లిలో బుధవారం కన్నుముశారు. అదే గ్రామంలో రేగా కుటుంబసభ్యులు అంత్యక్రియలను పూర్తిచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంతారావుకు ఫోన్‌చేసి పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రేగా నివాసానికి వెళ్లి పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో రేగాను పరామర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, అశ్వారావుపేట, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ తదితరులు నర్సమ్మ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధు తదితరులు రేగా ను ఫోన్ ద్వారా పరామర్శించారు. రేగా నర్సమ్మ – బొర్రయ్య దంపతులకు ఐదుగురు సంతానం. కాంతారావు నాలుగోవాడు. రేగా తండ్రి బొర్రయ్య 20 ఏండ్ల క్రితమే మృతిచెందారు.