మణుగూరు టౌన్, ఏప్రిల్ 17 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నిధుల సేకరణకు బీఆర్ఎస్ శ్రేణులు గురువారం మూ టలు ఎత్తారు.. మార్కెట్లో కూలి పనులు చేసి తమవంతుగా నిధులు సేకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వివిధ షాపుల వద్ద బియ్యం బస్తాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మోసి కూలి పనులు చేయగా ఆయా దుకాణాల యజమానులు కొంత మొత్తాన్ని చెల్లించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ పార్టీ సభను పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశంతో నిధులు సమకూర్చుకునేందుకు నాయకులు, కార్యకర్తలు కూలి పనులు చేసినట్టు చెప్పారు. సభకు తరలివెళ్లే వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులపై ఉన్నదని తెలిపారు.