హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనం చేయడంపై చర్చించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ‘రాష్ట్రంలోని దేవాలయ భూములు, కబ్జాలు, దేవాలయ నిర్వహణ, నిరాదరణ గురించి చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వయి హరీశ్‌బాబు ఇచ్చిన వాయిదా ప్రతిపాదననూ తిరస్కరించారు.