హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ‘సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి. బ్యాంకులతో మాట్లాడి అప్పులిప్పిస్తాం. విద్యుత్తును ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించండి’ ఇదీ రాష్ట్రంలోని సీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిన రైతులకు సర్కార్ చూపించిన ఆశ. కుదురుగా వ్యవసాయం చేసుకొంటున్న రైతులకు భారీగా లాభాలొస్తాయని అత్యాశ చూపారు. తీరా ప్లాంట్ల ఏర్పాటుకు డబ్బులు కట్టించుకొని, అంతా తమదే బాధ్యతని భరోసా ఇచ్చి మూసలోకి దించారు. చివరికి చేతులెత్తేశారు. ఇప్పుడేమో ఆయా ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తు ధరకు కోతపెట్టబోతున్నారు. కిలోవాట్‌కు ఏకంగా 15 పైసల చొప్పున తగ్గించనున్నారు. దీంతో లబ్ధిదారులైన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనున్న ది. ఒక మెగావాట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొన్న రైతుకు ఏడాదికి రూ.2.74లక్షలు.
రెండు వాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకొన్న రైతులకు నెలకు రూ.5.49 లక్షల చొప్పున నష్టం జరుగనున్నది. 25 ఏండ్ల కాలానికి ఒక మెగావాట్‌కు రూ.68.66 లక్షలు, రెండు మెగావాట్లకు రూ.1.37 కోట్ల చొప్పున నష్టం జరుగుతుందని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. సోలార్‌ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన యూనిట్ విద్యుత్తుకు రూ.3.13 చొప్పున ఇస్తామని తొలుత డిస్కమ్‌లు చెప్పాయి. ఇ ప్పుడేమో రూ.2.98 పైసలే ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ మేరకు ధర తగ్గింపునకు అ నుమతి కోరుతూ ఈఆర్సీకి పిటిషన్‌ను సమర్పించాయి. డిస్కమ్‌ల వైఖరిని రైతులు తీ వ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీఎం కుసుమ్ పథకంలో రాష్ట్రంలో 1,450 మోగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇ వ్వగా, రైతులు దరఖాస్తు చేసుకొన్నారు. దరఖాస్తు ఫీజు రూపంలో రూ.11వేలు, ఈఎండీ రూపంలో ఒక మెగావాట్‌కు రూ.లక్ష(జీఎస్టీతో కలుపుకొని రెండులక్షలకు పైగా) నగదు చెల్లించారు. బ్యాంక్ లింకేజీ విషయంలో అనేక ఇబ్బందులొస్తున్నాయి. ఒక్కో రైతుకు రూ.25 లక్షల అదనపు భారం పడుతున్నది.
రైతుల నడ్డి విరుస్తారా?
టీజీఈఆర్సీ ఆమోదించిన టారిఫ్ ఆధారంగానే రైతులు భారీ పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు టారిఫ్ తగ్గించి నడ్డివిరుస్తారా? టారిఫ్ తగ్గిస్తే తీవ్ర ఆర్థికభారం పడుతుంది. ఇప్పటికే పీ పీఏలు పూర్తయ్యాయి. రైతులు రు ణాలు తీసుకొన్నారు. పరికరాలు కొ ని, ప్రాజెక్టులు పూర్తిచేస్తున్న తరుణం లో ఇలా తగ్గించడం శోచనీయం.
– ఆదినారాయణరాజు
జీఎస్టీ తగ్గింపునే లెక్కగడుతారా?
కేవలం జీఎస్టీ తగ్గింపును పరిగణనలోకి తీసుకొని, టారిఫ్ తగ్గించాలని చూడటం దారుణం. సోలార్ మాడ్యూల్స్, స్టీల్, అల్యూమినియం, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్తు పరికరాలు, లేబర్ వ్యయం అన్నీ పెరిగాయి. వాస్తవ ప్రాజెక్ట్ వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం రాయితీలు అడుగడం లేదు. మేము పెట్టిన ఖర్చును వాస్తవ లెక్కలు గట్టి మాకు న్యాయం చేయాలి. లేదంటే నష్టం తప్పదు.
– పీ గంగారెడ్డి
నష్టం జరుగుతున్న తీరు
