ఆర్ఎస్పీకి భద్రత కుదింపు దుర్మార్గం
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించడంతోపాటు గన్మెన్ల భద్రతను కుదించడం దుర్మార్గ చర్యగా భావిస్తూ దళిత సంఘాల జేఏసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని నాచారంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- వెంటనే సెక్యూరిటీని పునరుద్ధరించాలి
- దళిత సంఘాల జేఏసీ, కార్మిక సంఘాలు
- హైదరాబాద్‌లోని నాచారంలో భారీ ర్యాలీ
- చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ)/చేవెళ్లటౌన్: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించడంతోపాటు గన్మెన్ల భద్రతను కుదించడం దుర్మార్గ చర్యగా భావిస్తూ దళిత సంఘాల జేఏసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని నాచారంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నాచారం సీఐకి వినతిపత్రం అందజేశారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం ఐపీఎస్ అధికారికి చట్టపరంగా కల్పించాల్సిన భద్రతను ప్రభుత్వం కుట్రతో తొలగించిందని ఆరోపించారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ రాస్తారోకో
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయార్య క్షత్రియ, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. పోక్సో కేసులో బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని ఉద్యమాన్ని నడిపినందుకు ఆర్ఎస్పీపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా భద్రతను తొలగించడం దారుణమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

