కాళేశ్వరం, జూలై 31 : కాళేశ్వరం వద్ద గోదావరి నదీ ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం గోదావరి, ప్రాణహిత నదుల నుంచి కాళేశ్వరం పుష్కరఘాట్ వద్దకు 3.15 లక్షల క్యూసెక్కుల నీరుతో వస్తూ లక్ష్మీ బరాజ్ వైపు వెళ్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం(సరస్వతి) బరాజ్ వరద నీరు తగ్గింది. బరాజ్‌కు గోదావరి నది, మానేరు వాగు 37,478 క్యూసెక్కుల నీరు రాగా 5 గేట్లు ఎత్తి 7728 క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరి నదిలోకి వదులుతున్నారు. బరాజ్‌లో 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.324 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మహదేవపూర్, జూలై 31 : లక్ష్మీబరాజ్‌లో వరద ప్రవాహం తగ్గింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బరాజ్‌లోకి వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గూతూ వస్తోంది. సోమవారం బరాజ్ ఇన్‌ఫ్లో 3,07,830 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. ప్రసుత్తం బరాజ్ నీటి మట్టం రివర్ బెడ్ నుంచి 5 మీటర్లుగా ఉందని ఆయన వెల్లడించారు.