హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ): రెడ్డి సమాజ హకుల సాధన కోసం సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లోని ఇందిరా పార్ వద్ద చేపట్టనున్న నిరసన దీక్షకు హాజరుకావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును రెడ్డి సంఘం నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు.
రెడ్డి జాగృతి, రెడ్డి జేఏసీ, రెడ్డి ఐక్యవేదికల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి, తమ సమాజ సంక్షేమం, హకుల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ ఐక్య పోరాటానికి బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, నాయకులు బుట్టెంగారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.