ఖమ్మంలో ఎర్రబంగారం ధర 20,850
ఖమ్మం వ్యవసాయ, వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్లకు మిర్చి బస్తా లు పోటెత్తాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం నుంచి దాదాపు లక్షల బస్తాల మిర్చిని విక్రయానికి తరలించడంతో యార్డులు పూర్తిగా నిండిపోయాయి.
- ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు పోటెత్తిన మిర్చి
ఖమ్మం వ్యవసాయం/కాశీబుగ్గ, ఫిబ్రవరి 19: ఖమ్మం వ్యవసాయ, వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్లకు మిర్చి బస్తా లు పోటెత్తాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం నుంచి దాదాపు లక్షల బస్తాల మిర్చిని విక్రయానికి తరలించడంతో యార్డులు పూర్తిగా నిండిపోయాయి. జాతీయ మార్కె ట్లో మంచి ధర పలుకుతుండటంతో స్థానిక వ్యాపారులు పోటీపడి పంట కొనుగోలు చేశారు. జెండా పాటలో మిర్చి పంట గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.20,850 పలికింది.
మధ్య రకం ధర రూ.19 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. తాలు రకం పంట కు క్వింటాల్ రూ.12 వేల గరిష్ఠ ధరతో వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తేజ రకం మిర్చికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ.21 వేలు, కనిష్ఠంగా రూ.14 వేలు, వండర్‌హాట్ అత్యధికంగా రూ.21,500, కనిష్ఠంగా రూ.16 వేలు, యూఎస్ 341 రూ.20,500, కనిష్ఠంగా రూ.14 వేలు, దీపిక రకం మిర్చి అత్యధికంగా రూ.20 వేలు, కనిష్ఠంగా రూ.13 వేలు, దేశీ రకం మిర్చి అత్యధికంగా రూ.38, 500, కనిష్ఠంగా రూ.30 వేలు, తాలు ర కం మిర్చి రూ.8,500, కనిష్ఠంగా రూ.5,000 పలికినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

