వరంగల్ : మిర్చి రైతులకు కాసుల వర్షం కురుస్తున్నది. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడు లేనంతగా మిర్చికి భారీ ధర పలుకుతున్నది. జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి ధర రోజు రోజుకి పెరిగిపోతున్నది. గురువారం సింగిల్ పట్టి రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ. 42,000 ధర పలికింది.
ములుగు మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిన రైతు పోల్నేని సత్యనారాయణరావు సింగిల్ పట్టి రకం మిర్చిని మార్కెట్ కు తీసుకు రాగా ఖరీదుదారులు ఈ ధర నిర్ణయించారు. ఇప్పటివరకు మార్కెట్లో సింగిల్ పట్టి రకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి.