హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ఈ వానకాలం సీజన్లో 14,816 మెగావాట్ల అత్యధిక విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గడిచిన తొమ్మిదేండ్లలో ఏ వానకాలంలోనూ ఇంత డిమాండ్ రాలేదు. ఈ నెల 25న 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా, అది రికార్డుగా నిలిచింది.
తిరిగి గురువారం ఉదయం 11.13 గంటలకు ఆ రికార్డును తుడిచేస్తూ 14,816 మెగావాట్లు రావడం గమనార్హం. వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో వానకాలంలో పంటల సాగుకు విద్యుత్తు అవసరాలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్తుకు భారీగా డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు.