Hyderabad | డేంజర్ బెల్స్.. దక్షిణాదిలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా హైదరాబాద్
హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా మారిందని గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Hyderabad | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా మారిందని గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్‌పీస్ ఆఫ్ ఇండియా సంస్థ సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. హైదరాబాద్‌లో 2.5 పీఎం కాలుష్య కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాల కంటే మన నగరంలో కాలుష్యం 14 రెట్లు అధికంగా విడుదలవుతున్నది. ప్రపంచ వాయు నాణ్యత సూచీలో కాలుష్య నగరాల జాబితాలో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది.
బంజారాహిల్స్‌లో 127, కేపీహెచ్బీలో 124, జూపార్క్‌లో 144, సైదాబాద్‌లో 100 ఏసీఐలకు వాయుకాలుష్యం చేరుకున్నది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లోనూ ఇటీవల వాయుకాలుష్యం అనూహ్యంగా పెరిగింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత కోల్‌కతా, హైదరాబాద్ ఉన్నాయి. ముంబై కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండటంతో అధికంగా కాలుష్యం పెరుగుతున్నదని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ తన సర్వేలో గుర్తించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

