హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా వాట్సాప్ ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో కార్పొరేట్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయబోతున్నామని, రామగుండం ఏరియాలో క్యాథ్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.